Dhanya Balakrishna: తెలుగు ప్రేక్షకులకు నటి ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ధన్య బాలకృష్ణ. ముఖ్యంగా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో ఎక్కువగా నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపాసినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా నటి ధన్య బాలకృష్ణ చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ మొగలిరేకులు సీరియల్ ఫేమ్ RK సాగర్ నటించిన ది 100 సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ నటించింది. దీంతో ట్రైలర్ లాంచ్ కి మూవీ యూనిట్ తో పాటు ధన్య కూడా పవన్ దగ్గరకు వెళ్ళిందట. పవన్ తో ఫోటో కూడా దిగిందట. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పంచుకొని స్పెషల్ మూమెంట్ అని తెలిపింది.
తాజాగా ఆదివారం రోజు ది 100 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో భాగంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను 12 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. ఆయనతో ఫోటో దిగాలి అనుకుంటున్నాను. ఆ కల సాగర్ గారి ద్వారా తీరింది. అది మాకు పెద్ద గిఫ్ట్, వరం లాంటిది. నాకు అది స్పెషల్ డే. మా టీమ్ కి పవన్ గారిని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతానేమో నన్ను పట్టుకోండి అని చెప్పాను. నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఆయన్ని కలవడం. కానీ ఆయన వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన అందర్నీ పలకరించి మా గురించి అడిగి, మాతో మాట్లాడి అడిగి మరీ ఫోటో ఇచ్చారు. టీమ్ అంతా దిగాం కానీ మాకు సింగిల్ గా ఫోటో కావాలని పిచ్చి. జరుగుద్దో లేదో అనుకున్నాను. కానీ ఆయనే అందర్నీ పిలిచి ఒక్కొక్కరికి ఫోటోలు ఇచ్చారు. అతిథి దేవో భవ అన్నట్టు చూసారు అని తెలిపింది. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
