ధనుష్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మార్కెట్ పరంగా కూడ చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నాడు. అయితే అది తమిళంలో మాత్రమే. తెలుగులో ఆయన సినిమాలకు అంతో ఇంతో క్రేజ్ ఉంది కానీ భారీ మార్కెట్ అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఆ మార్కెట్ బిల్డ్ చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అందులో భాగంగానే తెలుగు దర్శకుడి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. ఆసియన్ గ్రూప్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ధనుష్ మీద 120 కోట్లు అంటే రిస్క్ అనే అనాలి.
తమిళంలో ఆయన హయ్యస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ 70 కోట్ల వరకు ఉంటుంది అంతే. ఇక తెలుగు అరకొరగా ఉన్నా హిందీలో ఏమీ లేదు. పైగా శేఖర్ కమ్ముల పాన్ ఇండియా సినిమా చేసినా సింపుల్ అండ్ సెన్సిబుల్ సినిమానే చేస్తారు. కాబట్టి 120 కోట్లు ఎడ్జ్ మీద వెనక్కి రావాల్సిందే. ఇక ధనుష్ కు ఈ సినిమాకు గాను 50 కోట్ల పారితోషకం ఇస్తున్నారట. ధనుష్ కెరీర్లో ఇదే హయ్యస్ట్ అమౌంట్. ఈ స్థాయి పారితోషకం తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు మాత్రమే ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ధనుష్ కు ఇబ్బడం విశేషమే అనాలి. ఈ ఊపుతో ధనుష్ తెలుగులో మరిన్ని సినిమాలకు సైన్ చేసినా ఆశ్చర్యం లేదు.