Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నారు ధనుష్. తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. నటించిన తమిళ సినిమాలు కూడా తెలుగులోకి విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించాయి. అలా తెలుగు తమిళంలో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు హీరో ధనుష్.
కాగా ధనుష్ సినిమాల కోసం తెలుగు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరో ధనుష్. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ..నా చిన్నప్పటి నుంచి నాగార్జున నటనను చూస్తూ ఆయనను ఎంతో ఆరాధిస్తున్నాను.
అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది. తమిళంలో ఆయన నటించిన రక్షకన్ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వ్యక్తితో కలిసి నటించడం నా అదృష్టం. ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను అంటూ నాగార్జున పై ప్రశంసలు కురిపించారు. అలాగే నాగార్జున లాంటి లెజెండ్ ను చూసి తాను ఆశ్చర్యపోయాను. ఆయన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అంత గొప్ప నటుడితో నటించం చాలా గర్వంగా ఉంది. షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా అనుభవం తనపై శాశ్వత ముద్ర వేసింది అని చెప్పుకొచ్చారు ధనుష్. ఈ సందర్భంగా హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
