Hero Emotional: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిదే. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా శుక్రవారం రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలకు తగ్గట్టుగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ప్రేక్షకులతో పాటుగా ఈ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షోని థియేటర్లలో చూడాలని నిర్ణయించుకున్న హీరో ధనుష్ చెన్నై లోని శుక్రవారం ఒక థియేటర్ కు వెళ్లారు.
థియేటర్లో ధనుష్ నటనకు ముగ్థులైన ప్రేక్షకులు అరుపులు, కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది చూసిన ధనుష్ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకులు సినిమా చూస్తూ ఆనందంతో అరుపులు,కేరింతలతో థియేటర్ ని హోరెత్తిస్తుంటే అదే థియేటర్‌లో సినిమా చూస్తున్న ధనుష్ కూర్చీలో పలికించిన హావ భావాలు, ప్రేక్షకుల ఆనందానికి మంత్ర ముగ్ధుడై ఎమోషనల్ అయిన దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే సినిమాలో ధనుష్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. బెగ్గర్ పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించి మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు అని చెప్పాలి. ఇకపోతే హీరో ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ధనుష్. కుబేర సినిమా విడుదలకు ముందు నుంచి కూడా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.