స్పేస్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ధనుష్

Dhanush creates world record in Twitter space
Dhanush creates world record in Twitter space
తమిళ హీరో ధనుష్ అంటే డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన సినిమా చేశాడు అంటే అందులో ఏదో ఒక విశేషం ఉండి తీరుతుంది.  ఆయన గత చిత్రాలు ‘అసురన్, కర్ణన్’ రెండూ అలాంటి చిత్రాలే. ఇప్పుడు అదే బాటలో ఆయన చేసిన సినిమా ‘జగమే తంతిరం’. కార్తిక్ సుబ్బారాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ నెల16న సినిమా ఓటీటీ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా ధనుష్ ట్విట్టర్లో స్పేస్ నిర్వహించాడు. స్పేస్ అనేది ట్వీట్టర్లో కొత్తగా వచ్చిన కన్వర్జేషన్ ఫీచర్. దీని ద్వారా నేరుగా ఎవరితోనైనా, ఎంతమందితో అయినా కనెక్ట్ కావొచ్చు.  
 
నిన్న ధనుష్ కూడ కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా తన చిత్ర బృందంతో కలిసి స్పేస్ నిర్వహించారు.  ఆయన మాటలు, టీమ్ సంభాషణలు వినడానికి 17000 మందికి పైగా ఆ స్పేస్లోకి జాయిన్ అయ్యారు.  ట్విట్టర్ స్పేస్ ఫీచర్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఎవరి స్పేస్ సెషన్ కు ఇంతమంది జాయిన్ కాలేదు.  ధనుష్ స్పేస్లోలోకి వచ్చిన వారి సంఖ్యే అత్యధికం. గతంలో ఆర్మీ ఆఫ్ డెడ్ నటుడు జాక్ స్నిడర్స్ నిర్వహించిన స్పేస్ కంతే ధనుష్ స్పేస్ సెషనే ఎక్కువగా క్లిక్ అయింది. ఇలా ధనుష్ ట్విట్టర్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.  ఇకపోతే ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమా చేస్తున్నాడు.