Dhanush: కొడుకు కోసం మళ్లీ కలుసుకున్న ఐశ్వర్య ధనుష్ దంపతులు.. గ్రాడ్యుయేషన్ వేడుకలో అలా!

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ధనుష్ నటించిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవ్వడంతో ధనుష్ కూడా అదే ఊపుతో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో సోషల్ మీడియాలో కూడా నిలుస్తున్నారు ధనుష్. ఇకపోతే ప్రస్తుతం హీరో నాగార్జునతో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది.. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇకపోతే ధనుష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే విడాకులు తీసుకునే విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు ధనుష్ ఐశ్వర్య దంపతులు. తాజాగా మరోసారి వీరు కలుసుకున్నారు.

తన కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలలో పాల్గొన్నారు. కొడుకు సక్సెస్ చూసి పొంగిపోతున్న ధనుష్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. తాజాగా పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసి ప్రౌడ్ పేరెంట్స్ అంటూ రాసుకొచ్చారు. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తమ కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలలో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.