Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తి కావడంతో ఈయన ఏడాది పాలన గురించి స్పందించారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో ఈయన ఏకంగా 20 పేజీల నివేదికను విడుదల చేశారు ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారం అందుకున్నప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి అభివృద్ధి అనవసరంగా దూరమైందని పవన్ విమర్శించారు.
గత ప్రభుత్వ హయామంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. అలాగే శాంతి భద్రతలు కూడా పూర్తిగా క్షీణించి పోయాయని జగన్ ప్రభుత్వం పై ఈయన ధ్వజమెత్తారు.164 అసెంబ్లీ సీట్లతో ఎన్డీఏ ఘన విజయం సాధించిందని పవన్ గుర్తుచేశారు. దీనివల్ల ప్రజల్లో కాకుండా పెట్టుబడిదారుల్లోనూ నమ్మకం పెరిగిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలోకి వచ్చిందన్నారు.
తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పారదర్శక పాలనకే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు.ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మోదీ నాయకత్వాన్ని పవన్ ప్రశంసించారు. జలశక్తి, పంచాయతీరాజ్ తదితర శాఖల మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పవన్ తెలిపారు. ఒక పిఠాపురంలోనే వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందంటూ ఈ సందర్భంగా ఏడాది కాలంలో జరిగిన పాలన గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళుతున్న విషయాల గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.