బిగ్ బాస్ ఎఫెక్ట్ .. వ‌రుస ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీగా మారిన హారిక‌

బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ కెరీర్ గురించి మాట్లాడాలంటే బిగ్ బాస్ కి ముందు.. బిగ్ బాస్ కి తర్వాత అన్నట్లే ఉంది పరిస్థితి. ముఖ్యంగా టాలీవుడ్ లో మొదటి మూడు సీజన్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే నాల్గో సీజన్ కి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో బిజీ అయ్యారు. కొంతమంది అయితే గ్రాండ్ ఫినాలే రోజునే సినిమాలు.. టీవీ షోలో బిజీ అయిపోయారు. మరికొంతమంది యాడ్స్ లోనూ బిజీగా ఉన్నారు. మోనాల్ అయితే వెండితెరపై స్పెషల్ సాంగ్స్ లో మెరిపించింది. అలా ప్రతి ఒక్కరూ ఏదొక ప్రాజెక్ట్ లో ఫ్యూచర్ ఫ్లాన్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుటివరకు వెండితెరపై అలరించడానికి సిద్దంగా ఉన్న అభిజిత్, మోనాల్, సోహైల్, అరియానా ల సినిమా అప్డేట్స్ మాత్రమే తెరపైకి వచ్చాయి.

సోహెల్ సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. తన సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ కాల్ కూడా అయిపోయింది. అలాగే అరియానా గ్లోరీ రాజ్ తరుణ్ తో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మోనాల్ కూడా ప్రముఖ టీవీ చానెల్ లో డాన్స్ ప్లస్ షో లో ఫుల్ బిజీగా ఉంది. అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేతిలో ఉన్నట్లు తెలిపింది. అభిజిత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. స్టోరీలను ఇంకా సెలెక్ట్ చేసుకునే దిశగానే అడుగులు వేస్తున్నారు.

ఇక లేటెస్ట్ దేత్తడి హారిక టర్న్ స్టార్ట్ అయ్యిందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తాను ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో వర్క్ చేస్తున్నానని.. రీసెంట్ గా ఓ సినిమాకి సైన్ చేశానని తెలిపింది. యూట్యూబ్ లో తన యంగ్ టాలెంట్ తో ఆకట్టుకున్న హారిక.. ఇప్పుడు ఓటీటీపైనా.. వెండితెరపైనా తన టాలెంట్ ని ప్రజంట్ చేసేందుకు సిద్దమయ్యింది. మొత్తానికి బిగ్ బాస్ తో హారిక భలే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.