Pawan Kalyan: డైలాగులు సినిమాల్లో చెప్పడానికి కూడా ఇబ్బంది పడతా.. మళ్లీ ఫైర్ అయిన పవన్!

Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా ఏపీ అభివృద్ధి పైన ఫోకస్ చేశారని తెలుస్తుంది.కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, సనాతన ధర్మం అంటూ ఆ విషయాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన పవన్ ప్రస్తుతం రూట్ మార్చి రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు.ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు ఫినిష్ చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఛాన్స్ దొరికిన్నప్పుడు మాత్రం తగ్గేదే లే అంటూ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు..

ఇటీవల జగన్ పుష్ప సినిమాలో డైలాగులు చెప్పడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమా డైలాగులు హాల్ వర్క్ బాగుంటాయి కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి బాగుండవు అంటూ తనదైన శైలిలోనే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని హెచ్చరించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా నరసింహపురంలో రూ.1,290 కోట్లతో ఏర్పాటు చేయనున్న రక్షిత తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీను మరోసారి టార్గెట్ చేశారు. “2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా? ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం” అని పవన్ సవాల్ విసిరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి కక్షలు లేవని పవన్ తెలిపారు.గత ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజంతో ప్రజలను భయపెట్టి వేధించిందని ఆరోపించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని ఆయన విమర్శించారు..

మీకు గతంలో 151 సీట్లు వచ్చి నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడే కదా మిమ్మల్ని ఎదుర్కొంది మీలాంటి వారిని ఎదుర్కోవాలంటే నా గుండెల్లో ఎంత ధైర్యం ఉండాలి అంటూ పవన్ తెలిపారు. నేను కూడా సినిమాలలో నుంచి వచ్చిన వాడిని మెడ కాయలు కోస్తాం అంటూ వార్నింగులు ఇస్తే మేము ఏమైనా చొక్కాలు విప్పి చూపిస్తామా. తాటాకు చప్పుళ్ళకి మేం భయపడమని ఫైర్ అయ్యారు. సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటా. సింహం గడ్డం గీసుకుంది.. నేను గీసుకోలేదంటే సీనప్ చేయడానికే. సింహం నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. కేవలం 11 సీట్లు గెలిచిన వైసీపీకి.. కూటమి ప్రభుత్వం గౌరవం ఇస్తోందని, తమ పాలనలో తప్పులుంటే చెప్పాలని, సరిదిద్దుకుంటామని తెలిపారు. కూటమి అంటే పిడికిలి లాంటిదని పిడికిలి నుంచి ఒక వేలు పక్కకు వెళ్లిన ఏకలవ్యుడి పరిస్థితి అవుతుంది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.