Pawan Kalyan: ప్రజాతీర్పుకు ఏడాది… ఏడాది కూటమి పాలనపై పవన్ భావోద్వేగా పోస్ట్!

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది సరిగ్గా గత ఏడాది జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో కూటమి పార్టీలు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని నేటికీ సరిగ్గా ఏడాది కావడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ప్రజా తీర్పుకు ఏడాది. ప్రజా చైతన్యానికి ఏడాది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది’ అంటూ ట్వీట్ చేసారు.

జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత ప్రధాని మోదీ నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన రోజు.

మీరు ఇచ్చిన ఈ తీర్పును ఎంతో బాధ్యతగా తీసుకున్నామని గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా, జనసేన పార్టీ – తెలుగుదేశం – బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందచేస్తోంది. రాబోయే రోజులలో మరింత సమర్థవంతమైన పాలనను అందిస్తాము. ఈ విజయంలో భాగమైన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.