Poojitha: రామానాయుడు గారు వెంకటేష్‌తో తీసిన గణేశ్ మూవీలో తాను సెకండ్ హీరోయిన్ పూజిత అన్నారు. ఒక నాలుగైదు సీన్లు చేశాక ఏమైందో ఏమో తెలియదు గానీ, ఎడిటింగ్ ఆ సీన్స్ తీసివేశారని ఆమె చెప్పారు. ఆ మూవీ రిలీజయ్యాక చూసుకుంటే తాను ఇక్కడ ఉండాలి అని అనుకున్న సీన్స్ ఏవీ సినిమాలో లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు రామానాయుడు గారు తనను పిలిచి ఎడిటింగ్‌లో పోయిందని చెప్పినట్టు పూజిత తెలిపారు. ఏమనుకోవద్దు.. నెక్ట్స్ సినిమా చేద్దువు గానీ అని ఆయన అన్నట్టు ఆమె చెప్పారు.
ఇదిలా ఉండగా కొందరు తనను ఓ సినిమాలో అనుకుంటారు. తీరా కట్ చేస్తే ఆ సీన్‌లో వేరొకరుంటారని ఆమె అన్నారు. ఏం జరిగింది, ఎందుకు అనే విషయాలు తాను అడగగనని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడైనా ఆయన ఎదురు పడితే తాను నమస్కారం చెప్పినపుడు తాను కాదు, ఆయన తలెత్తుకోలేరు అని ఆమె చెప్పారు. అంతే గానీ తాను దాని గురించి ఆలోచించనని ఆమె అన్నారు. అయితే ఇలాంటి సంఘటనే ఓ సారి జరిగిందని అది కన్నడ మూవీ విషయంలో అని ఆమె చెప్పారు. తన ఇంట్లో భోజనాలు చేశారు, తానే ఆ సినిమాలో నటించేది అని చెప్పారు. చివరికి ఫ్లెక్సీలో చూస్తే మాత్రం తాను లేనని ఆమె చెప్పారు. అప్పుడే తనకు మొదటిసారి ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే తనతో పని చేయించుకొని చివరికి డబ్బులివ్వలేదని నటి పూజిత తెలిపారు. ఉదాహరణకు తనకు ఓ ప్రొడ్యూసర్ చాలా పేమెంట్ ఇవ్వాల్సి ఉండగా అతన్ని చాలా వరకు టాప్ మోస్ట్ బట్టల దుకాణం లేదా నగల కొట్టులో చూస్తానని ఆమె అన్నారు. కానీ బయటికి రాగానే మాత్రం తనతో నా పరిస్థితి అస్సలు బాగోలేదమ్మా.. ఏం చేయాలి? అని అంటారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ అతను బయటికొచ్చేది మాత్రం ఖరీదైన బట్టలు లేదా నగల దుకాణం నుంచి అని, వాళ్ల భార్యకున్నన్ని నగలు అలివేలు మంగమ్మ తర్వాత అన్ని నగలు వేసుకునేది ఆమేనేమో అని ఆమె చెప్పారు. కానీ ఆయన మాత్రం కష్టంలో ఉన్నానని చెప్తారని పూజిత అన్నారు. అప్పుడు తాను కష్టంలో ఉన్నపుడు మీరు మాత్రం ఏం చేస్తారు. నేను వెయిట్ చేస్తాలేండీ అని అంటానని ఆమె వివరించారు.