Kaushal: ఎవరైనా తన గురించి నెగెటివ్‌గా మాట్లాడినా, తనను గెలికినా ఎక్కడో టచ్ అవుతుంది అని నటుడు కౌషల్ అన్నారు. తన ఎక్స్‌పీరియన్స్ అంత వయసు కూడా లేని దీప్తి సునయన తనను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నపుడు.. కౌషల్ రెండు వారాల్లో వెళ్లిపోతాడని కామెంట్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సీన్‌ను నాని గారు టీవీలో తనకు ఎప్పుడైతే చూపించారో, అప్పట్నుంచి తనకు తానేంటో చూపించాలని స్థిరంగా నాటుకుపోయిందని ఆయన తెలిపారు. వీళ్లకే కాదు, ఈ ప్రపంచానికి కూడా తానేంటో నిరూపించి చూపించాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు.
ఆ తర్వాత తాను బిగ్‌బాస్ నుంచి బయటికి వస్తానేమోనని భావించి తన ప్రోమో కూడా రెడీ చేశారని, కానీ ఫైనల్లో ఓటింగ్ పూర్తవబోతుందన్న ఒక గంట ముందు ఆ నిమ్మకాయ ఎపిసోడ్ రిలీజ్ అవ్వడం, తన రాత మారడం అన్నీ జరిగిపోయానని కౌషల్ చెప్పారు. నిజంగా అదంతా తన లక్కేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ నిమ్మకాయ ఆ ఎపిసోడ్‌లో కాకుండా వేరే ఎపిసోడ్‌లో పెడితే తాను ఉండకపోయి ఉండేవాడిని కానేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కాబట్టి అదంతా దేవుడి దయలాగే తాను భావిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే తాను హౌస్ నుంచి బయటకు వచ్చాక ఒక్క మాటల్లో చెప్పాలంటే వస్తున్న రెస్పాన్స్ చూసి తాను ఉక్కిరిబిక్కిరి అయిపోయానని కౌషల్ తెలిపారు. అందరూ ఇలా తన కోసం 2కె వాక్‌లు చేస్తున్నారని తనకు సెల్‌ఫోన్లలో చూపిస్తుంటే చాలా షాక్ అయ్యానని, అసలు నమ్మలేకపోయానని ఆయన అన్నారు. అవన్నీ చూశాక తనకు 3 రోజుల వరకు నిద్ర కూడా రాలేదని ఆయన తెలిపారు. ఇంతమంది ఫాలోవర్ ఉన్నారా, ఇన్ని త్యాగాలు చేస్తున్నారా, ఇక్కడి వారే కాకుండా వేరే దేశాల వాళ్లు కూడా తన గురించి మాట్లాడడం చూసి తాను చాలా థ్రిల్లింగ్‌గా ఫీలయినట్టు ఆయన వివరించారు.