Deepthi Sunaina Shanmukh: ఇటీవలే దీప్తి సునైనా, షణ్ముఖ్ బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే దీప్తి సునైనా బ్రేకప్ తర్వాత నిత్యం ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. బ్రేకప్ బాధ నుంచి బయట పడటానికి దీప్తి సునైనా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా నిత్యం పలురకాల ఇంట్రెస్టింగ్ కొటేషన్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంది.
ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను షేర్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి కంటే అబద్ధాలు ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి.. ఎందుకంటే నిజాలు బట్టలిప్పి అందర్నీ నగ్నంగా నిలబెడతాయి.. అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి అని రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను షేర్ చేసింది దీప్తి సునైనా. ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా ట్వీట్ చేస్తూ కొత్త ఏడాది ఏంటో ఇలా ఉంది.. కొందరు సోలోగా బతుకుతున్నారు.. కొందరు బాధల్లో ఉన్నారు.. మరికొందరు డోలో వేసుకుంటున్నారు అంటూ ఒక పోస్ట్ ను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇలా దీప్తి సునైనా నిత్యం ఏదో ఒక కొటేషన్ ను సోషల్ మీడియాలో చేస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో దీప్తి సునైనా చేస్తున్న పోస్టులను బట్టి చూస్తే ఆమె బ్రేకప్ విషయంలో చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ విషయానికి వస్తే.. దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పినా కూడా అతడు ఆమె కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అంతేకాకుండా దీప్తి సునైనా మనసు మళ్లీ మారుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దీప్తి సునైనా ఇలాంటి కామెంట్స్ చేసిన, వీడియోస్ పెట్టినా కూడా ఓపిక భరిస్తున్నాడు. పరిచయం మా కోరిక మేరకు దీప్తి సునయన తన కోరికను మార్చుకుంటుందా? లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.