పవిత్రమైన గుడిలో కూడా గ్లామర్ షో తో రెచ్చిపోయిన దీప్తి సునైన.. ఫోటో వైరల్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది రాత్రికి రాత్రి పాపులర్ అవుతూ సెలెబ్రెటీలుగా మారుతున్నారు. ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వల్ల చాలా మంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వాళ్ళల్లో దీప్తి సునైనా కూడా ఒకరు. టిక్ టాక్ వీడియోలు, వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలతో దీప్తి బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ ద్వారా తన పాపులారిటీ మరింత పెంచుకుంది. ఇక షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఎన్నో వీడియోలు, వెబ్ సీరీస్ లు చేసిన దీప్తి అతనితో ప్రేమాయణం నడిపింది. ఈ కారణంగా వీరిద్దరూ జంటగా బాగా ఫేమస్ అయ్యారు.

ఇలా షణ్ముఖ్ కి కూడా బిగ్ బాస్ షో లో పాల్గొనే అవకాశం దక్కింది. కానీ ఈ షో ద్వారా షణ్మఖ్ నెగిటివిటీ మూటకట్టుకోవటంతో దీప్తి అతనికి బ్రేకప్ చెప్పి మరింత ఫేమస్ అయ్యింది. అయితే షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సోషల్ మీడియాలో తన జోరు మరింత పెంచింది. పాటలకు అందంగా డాన్సు చేస్తూ ఉన్న వీడియోలతో పాటు తన గ్లామరస్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడు పెట్టే అందాల విందుకి నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇటీవల దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇటీవల దీప్తి ఎరుపురంగు చీరలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో అమ్మడు నడుము అందాలు చూపిస్తు కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ అమ్మడు దిగిన ఈ ఫోటోలలో ఉండే ప్రదేశం ఒక పవిత్రమైన దేవాలయం కావటంతో నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. పవిత్రమైన గుడిలో కూడా ఇలాంటి అరాచకాలు ఏంటి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం దీప్తి అందాలకు ముగ్ధులవతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు దీప్తి తన అందాలతో రెచ్చగొడుతూ.. ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.