Deepthi Sunaina: ఆగని షణ్ణు- దీప్తి లవ్ వార్.. వాలెంటెన్స్ నాడు షాకింగ్ పోస్ట్ చేసిన దీప్తి సునయన

Deepthi Sunaina: షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ స్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి ప్రారంభం నుంచీ టైటిల్ కొట్టేందుకు సన్నాహాలు సాగించాడు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ టాస్క్ లు, గేమ్స్ సరిగా ఆడక పోయినప్పటికీ షన్నుని మాత్రం బిగ్ బాస్ విజేతగానే చాలామంది భావించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అతనికి మిలియన్ లలో ఫాలోవర్స్ ఉండడమే. కానీ షో ముందుకు సాగే కొద్దీ అతని ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. తోటి కంటెస్టెంట్ అయిన సిరితో హద్దులు దాటి ప్రవర్తించడంతో అభిమానులకు విసుగు వచ్చింది. ఇక అభిమానుల ఇమేజ్ సంగతి పక్కన పెడితే ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న దీప్తి సునయన కూడా దూరమైంది. తాజాగా వారిద్దరూ బ్రేక్ అప్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ బ్రేకప్ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా మారిపోయినప్పటికీ షన్ను మాత్రం దీప్తిని మర్చిపోలేక పోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అతను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలే నిదర్శనం. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షన్ను- సిరి చేసిన హంగామా అంతా ఇంతా కాదని టాక్. ఇద్దరూ కూడా ఒకరు లేకపోతే ఇంకొకరు బతకలేరు అన్నట్టుగా చేసి వీక్షకులకు చిరాకు తప్పించారు. ఆ సన్నివేశాలతో సిరి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎంత డామేజ్ అయ్యింది తెలుసుకుని బాధపడుతున్నట్లు సమాచారం. వారిద్దరూ కూడా విడిపోయారని వార్తలు వస్తున్నప్పటికీ అందరి ముందు మాత్రం బాగానే ఉన్నారు.

ఇక షణ్ణు- దీప్తి బిగ్ బాస్ వల్ల ఈ మధ్య బ్రేకప్ ప్రకటించిన వీరిద్దరూ ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఉత్సవం 2022కు హాజరవుతారని ప్రచారం జరిగింది. ఒక పక్క ఎవరికి వారు తమ కెరీర్ చూసుకుంటూ బిజీగా ఉన్నా.. దీప్తి సోషల్ మీడియాలో మాత్రం పోస్టులను ఆపడం లేదు. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటంటే తన ఒంటిపై టాటూ కనబడేలా బాధాకరమైన ముఖంతో కూడిన ఫోటోను జతచేసిన సునయన, ఆనందం అనేది మనకు మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత వేరొక మనిషి నీకు అది తీసుకురారు అని పోస్ట్ చేశారు. ఇది ప్రత్యక్షంగా షణ్ముఖ్ పేరును ట్యాగ్ చేయనప్పటికీ పరోక్షంగా అది అతన్ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది.