Deepika Padukone: ఎన్టీఆర్, బన్నీ గురించి మనసులో మాట బయటపెట్టిన దీపికా?

Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారందరూ పాన్ ఇండియా చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు సైతం పాన్ ఇండియా చిత్రాల్లో నటించడంతో బాలీవుడ్ ముద్దుగుమ్మ సైతం తెలుగు సినిమాలపై తెలుగు హీరోలతో నటించాలని ఎంతో ఆతృతగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ హీరోల సరసన నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలియా భట్, అనన్య పాండే, దీపికా పదుకునే వంటి హీరోయిన్ల తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా దీపికా పదుకొనే నటించిన
గెహ్రైయాన్ ఈ రోజు అమెజాన్ ప్ర్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య పాండేతో పాటు దీపికా పదుకొనే కూడా నటించారు. ఈ సందర్భంగా దీపికా పదుకొనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలతో నటించాలని ఎంతో ఆశగా ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో కలిసి నటించాలనే కోరిక ఉందని ఈ ముద్దుగుమ్మ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. అయితే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక దీపిక పదుకొనే ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హీరోలతో కూడా నటించాలని కోరిక ఉందని దీపికా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.