Janhvi Kapoor – Khushi Kapoor: ఇంస్టాగ్రామ్ డెబ్యూ.. పాండా కపూర్ ఎంట్రీ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!

Janhvi Kapoor – Khushi Kapoor: వెండి తెరపై అతిలోకసుందరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇదిలా ఉండగా శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఇప్పటికే జాన్వికపూర్ ఎంట్రీ ఇచ్చారు. ఈమె ఎంట్రీ ఇవ్వడంతోనే అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. జాన్వి కపూర్ మాదిరిగానే ఖుషి కపూర్ కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకుండానే విపరీతమైన సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో మిలియన్ కొద్దీ ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. ఇక వీరిద్దరిని క్యాష్ చేసుకోవడం కోసం రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఈ పాండా కపూర్ ఎవరు అనే కదా మీ సందేహం? పాండా కపూర్ అంటే మనిషి కాదండోయ్.. అది ఒక కుక్క. పాండా కపూర్ ఝాన్వి కపూర్ ఖుషి కపూర్ ల ఫేవరెట్ పెట్ డాగ్.

జాన్వి, ఖుషి కపూర్లతో ఫేవరేట్ డాగ్ పాండా కపూర్ ఇంస్టాగ్రామ్ ఇవ్వడంతోనే ఏకంగా వంద మార్క్ దాటేశారు. వెయ్యి మార్క్ దాటే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇంస్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ ఖుషి కపూర్ కి పెద్ద సంఖ్యలో ఫాన్ ఫాలోయింగ్ ఉండటంతో వీరి అభిమానులు సైతం పాండా కపూర్ ను ఫాలో అవుతున్నారు.