బుల్లితెరపై అదిరే గ్రాండ్ రియాలిటీ షోలలో హిందీ ఫేమస్ కౌన్ బనేగా కరోడ్ పతి కూడా ఒకటి దీనినే మొదట తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” అని స్టార్ట్ చేశారు. అలాగే లేటెస్ట్ గా మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా కాస్త మర్చి జెమినీ టీవిలో “ఎవరు మీలో కోటీశ్వరులు” లో టెలికాస్ట్ చేస్తున్నారు.
మరి గత సీజన్లతో పోలిస్తే అధిక రెస్పాన్స్ తో ఇది దూసుకెళ్తుండగా ఓ భారీ ఎపిసోడ్ ని మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేశారు. ఇది ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు టీఆర్పీ రికార్డ్స్ సెట్ చెయ్యడం కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు.
మరి దీనిని అనుకున్న దానికంటే ముందే టెలికాస్ట్ కి తీసుకురానున్నారట. వచ్చే డిసెంబర్ 5 ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేయనున్నారట. ఇక ఇది టెలికాస్ట్ అయితే ముందు టీఆర్పీ రికార్డులు అన్నీ బద్దలు అవ్వడం ఖాయం అని చెప్పాలి.