Dasari Arun Kumar: టాలీవుడ్ దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎన్నో సినిమాలు తీసి గిన్నిస్ గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించారు. కేవలం దర్శకుడి గా మాత్రమే కాకుండా నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలను తీసి తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా కూడా ఎదిగారు. ఇదిలా ఉంటే తాజాగా దాసరి నారాయణరావు రెండో కుమారుడు అయిన దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే..
తాజాగా గురువారం తెల్లవారుజామున అరుణ్ కుమార్ ర్యాష్ డైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. రాష్ట్ర డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పై వస్తున్న రెండు బైకులు ఢీ ఢీ కొట్టాడు. అరుణ్ కుమార్ ఢీ కొట్టిన బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అరుణ్ కుమార్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో కూడా 405 పాయింట్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక అరుణ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే సామాన్యుడు, చిన్న, ఆది విష్ణు వంటి సినిమాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే.
తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక పోతే ఆ మధ్య ఒక సారి దాసరి నారాయణ రావు ఇంటికి కోర్టు నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఇంటి నిర్మాణం కోసం ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని చెల్లించలేదు అన్న నేపథ్యంలో సదరు వ్యక్తి సివిల్ కోర్టును ఆశ్రయించగా, దాసరి నారాయణరావు ఇంటిని సీల్ చేస్తూ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.