డార్లింగ్ బర్త్‌డే స్పెషల్: ఈ సారి మామూలుగా ఉండదు

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రబాస్ జోరు మామూలుగా లేదు. వరుస ప్రాజెక్టులు.. వరుస షూటింగులు.. ఓ రేంజ్‌ బిజీగా ఉన్నాడు ప్రబాస్. భారీ బడ్జెట్ చిత్రాలతో మరోసారి సంచలనాలకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఈ ఏడాది ప్రబాస్ బర్త్‌డే చాలా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు సీని వర్గాలు కూడా ముస్తాబైపోతున్నాయి.

ఆ క్రమంలో, సంక్రాంతి రేస్‌లో ఉన్న ‘రాధే శ్యామ్’ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతున్నారట ప్రబాస్ పుట్టినరోజు కానుకగా. ‘రాధే శ్యామ్’ సినిమా టీజర్‌ని ప్రబాస్ పుట్టినరోజుకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రబాస్ నుంచి అప్‌డేట్ ఎప్పుడా.? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా అసలు సిసలు పండగే అని చెప్పాలి.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోందీ సినిమా. మరోవైపు ‘ఆదిపురుష్’ నుంచి ప్రబాస్ లుక్‌ని అధికారికంగా రిలీజ్ చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.