కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేసి.. చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అనసూయ, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, ‘గంధర్వ’ హీరో సందీప్ మాధవ్, దర్శకుడు వీరశంకర్, ఉత్తేజ్, చిట్టిబాబు, నాగమహేష్, షఫీ, కుమనన్ సేతురామన్, వెంపక శ్రీను, జర్నలిస్ట్ ప్రభులతో పాటు కరీంనగర్ సిటీ కమిషనర్ సత్యన్నారాయణ, ఐడీబిఐ బ్యాంక్ డిజిఎమ్స్ వి. ప్రదీప్ కుమార్, ఎస్‌సిఎమ్ శెట్టి, హము రమావత్, ఇంకా చిత్రబృందం పాల్గొంది.
నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ”నాకు ఈ చిత్ర సంగీత దర్శకుడు మంచి ఫ్రెండ్. జర్నలిస్ట్ ప్రభుగారితో రోజు నాకు ఛాయ్ తాగే అలవాటుంది. దర్జా’ క్లైమాక్స్ ఆర్ఆర్ విని నేను థ్రిల్ ఫీలయ్యాను .నేను కూడా ఈ మూవీ లో ఓ పాట పాడాను. ఆ పాటలోనా కుమార్తె కూడా భాగమైంది. ఈ సినిమాని నేను 75 శాతం చూడటం జరిగింది. ఇది బెస్ట్ ఫిల్మ్ కాబోతోంది. సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్” అని తెలిపారు.
కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యన్నారాయణ మాట్లాడుతూ.. ”సినిమా అంటే సమాజంపై చాలా ప్రభావం చూపే మాధ్యమం. అందుకే దానికి అంత క్రేజ్. అందరికీ వినోదాన్ని పంచడంలో సినిమాని మించింది లేదు. ఈ సినిమాని మా గ్రామానికి చెందిన వ్యక్తి నిర్మించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాపై పెద్ద పెద్ద విజయం సాధించిన సినిమాల్లో నటించిన వారు నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి.. నిర్మాతలకు మరిన్ని మంచి చిత్రాలను నిర్మించేందుకు మార్గం కావాలని కోరుకుంటున్నాను..” అన్నారు.
నటుడు షఫీ మాట్లాడుతూ.. ”కొత్త టీమ్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అనసూయగారు ఆసనంపై ‘దర్జా’గా కూర్చున్నారు. పోస్టర్ చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ చూశాను. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..” అన్నారు.
నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ.. ”ఈ సినిమా చాలా దర్జాగా తీశారు. ఇందులో నేను కూడా ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటించాను. చాలా కొత్త కాన్సెప్ట్. కొత్తవారైనా కూడా చాలా చక్కగా సినిమాని తీశారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కామినేని శ్రీనివాస్‌గారి ప్రోద్బలం ఎంతో ఉంది. ర్యాప్ రాక్ షకీల్ మంచి సంగీతం ఇవ్వగా.. ఆయన భార్య నేహా ఇందులో ఓ పాటని చాలా చక్కగా పాడారు. సునీల్, అనసూయ, సత్తిపండు ఇలా ఎందరో ఈ సినిమాలో నటించారు. జూలై 22న సినిమా విడుదలకాబోతోంది. అంతా దర్జాగా థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసి ఘన విజయం చేయాలని కోరుతున్నాను..” అన్నారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ”ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా చాలా బాగా వచ్చినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ డ్యాన్స్ బాగా చేశారు. అనసూయగారు ఈ పాత్రలో చాలా హుందాగా ఉన్నారు. ఈ సాయంత్రం ఇలా అందరినీ మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని థియేటర్‌కి వచ్చి చూడాలని ప్రేక్షకులను కోరుతున్నాను. కంటెంట్ వైజ్‌గా చాలా మంచి కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నా చిత్రం ‘గంధర్వ’కు ర్యాప్ రాక్ షకీల్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా ఆయన అదరగొట్టేసి ఉంటాడని అనుకుంటున్నాను. థ్యాంక్యూ ఆల్” అని తెలిపారు.
సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్ మాట్లాడుతూ.. ”ముందుగా ఈ వేడుకకు వచ్చిన అందరికీ థ్యాంక్యూ. కామినేని శ్రీనివాస్‌గారు ఈ సినిమా గ్రాండియర్‌గా రావడానికి ఎంతో సహకరించారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిర్మాత శంకర్‌గారు నాకు అన్నయ్య అయిపోయారు. వచ్చిన గెస్ట్ లందరికీ థ్యాంక్యూ సో మచ్. ముందుగా ఉత్తేజ్‌గారు పాడిన పాటకి ఓ విశిష్టత ఉంది. ఆ పాట అనసూయగారి వాక్ చూసి పుట్టింది. అలాగే అనసూయగారి లుక్‌లో నుండే ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పుట్టింది. అందుకే ఇవాళ ఆర్ఆర్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ అనసూయగారి గురించి, సునీల్ గారి గురించి తర్వాత డైరెక్టర్ గారి గురించి, ఆ తర్వాత బీజీఎమ్ గురించే మాట్లాడతారు. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇందులో నటించిన నటీనటులందరికీ థ్యాంక్యూ సో మచ్. ఎక్కడో ముంబైలో ఉన్న నన్ను అమ్మ రాజశేఖర్ గారు తన ‘రణం 2’ సినిమా కోసం తీసుకొచ్చారు. ఆ సినిమాకి మణిశర్మగారు సంగీతం అందిస్తే.. నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. ఫస్ట్ సినిమానే అటువంటి దర్శకుడితో చేసినందుకు చాలా హ్యాపీ. ఆ తర్వాత శ్రీకాంత్ అన్నయ్య నాకు వరుసగా అవకాశాలు ఇచ్చి.. నిలబెట్టారు. శ్రీకాంత్ అన్నయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సో మచ్ అన్నయ్య. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..” అని అన్నారు.
దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ.. ”దర్జా అంటే రాయల్టీ. స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి కథ తెరపైకి వచ్చిందని చెప్పగలను. జూలై 22న థియేటర్లకి వెళ్లి ‘దర్జా’గా ఈ సినిమా చూడండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నిర్మాతలు శివశంకర్‌గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రాణం పెట్టేశారు. షకీల్‌గారికి ధన్యవాదాలు. స్ర్కిప్ట్ కో ఆర్డినేటర్ బాబీగారికి ధన్యవాదాలు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణునికి థ్యాంక్యూ. స్టోరీ నజీర్‌గారు దర్జాగా ఈ స్టోరీ రాశారు. ఫైట్ మాస్టర్ అంజిగారికి ధన్యవాదాలు. డిఫరెంట్‌గా ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లేడీ మెగాస్టార్ అనసూయగారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు. సునీల్‌గారు, ఇతర ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్యూ” అని అన్నారు.
కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”ఈవాళ ‘దర్జా’ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన నా మిత్రుడు నవీన్ ఎర్నేనిగారికి, దర్శకుడు బుచ్చిబాబుగారికి, అనసూయగారికి.. ఇతర అతిథులకు, చిత్రయూనిట్‌కు, దర్శకనిర్మాతలకు, వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. శివశంకర్ నాకు చాలా ఆత్మీయుడు. ఒకే ప్రాంతం నుండి వచ్చాం. ఎప్పుడూ నాతోనే ఉంటాడు. నేను ఈ సినిమాని సమర్పిస్తున్నట్లుగా పేరు వేసిన విషయం కూడా ముందు నాకు తెలియదు. అసలు నాకు సినిమా ప్రొడక్షన్ గురించి ఏమీ తెలియదు. సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాను కానీ.. ప్రొడక్షన్ పరంగా ఏమీ తెలియదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో నాకు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు తెలిసిన వాళ్లు ఎందరో ఉన్నారు. నిర్మాత శివశంకర్ ఏది అడిగితే అది చేసిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను..” అని అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ”కామినేని శ్రీనివాస్ గారికి, మైత్రీ ప్రొడ్యూసర్ నవీన్‌గారికి నమస్కారం. ఈ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ల సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతూనే ఉంటాయి. కానీ మొట్టమొదటి చిత్రం చేస్తున్న దర్శకుల చిత్రాలు మాత్రం ఖచ్చితంగా హిట్టవ్వాలి. అలా హిట్ అయితేనే ఇంకో 10 మంది నిర్మాతలు అతనితో సినిమా తీయడానికి ముందుకొస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో డబ్బులు ఎక్కువ వస్తాయేమో తెలియదు కానీ.. సినిమాపై ప్యాషన్‌తో వచ్చి ఇలా సినిమాలు నిర్మించడం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బులు వస్తాయో, రావో తెలియదు.. అయినా ప్యాషన్‌తో సినిమాలు చేస్తుంటారు. అందుకే మొదటి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా నిర్మాతలకు మంచి హిట్ రావాలి. సునీల్‌గారు ఈ సినిమాలో రగ్డ్ లుక్‌లో ఉన్నారు. అనసూయగారు ‘రంగస్థలం’ నుంచి మా ఇంట్లో మనిషిగా మారారు. బుల్లితెర, వెండితెర ఏదైనా.. ఆమె ప్రయత్నం విజయవంతం కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఎనర్జీ చూస్తుంటే.. ఇదో పెద్ద కమర్షియల్ చిత్రమని అనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి.. అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీమ్‌కి ఆల్ ద బెస్ట్” అన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ”ఈ చిత్ర నిర్మాతలు కామినేని శ్రీనివాస్‌గారి ద్వారా పరిచయం. ఈ మూవీ గురించి ప్రతీది నాకు తెలుస్తూనే ఉంది. కొన్ని రషెస్ చూడటం జరిగింది. అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అయినా.. వెనకడుగు వేయకుండా ఈ సినిమాని తీశారు. సినిమా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ.. ఎంటైర్ యూనిట్‌కు గుడ్ లక్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని జూలై 22న చూసి ఆదరించాలని కోరుతున్నాను..” అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ”ముందుగా ఈ వేడుకకు వచ్చిన బుచ్చిబాబుగారికి, నవీన్ ఎర్నేనిగారికి,కరీంనగర్ సి పి సత్యన్నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మొదటి నుండి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఇంత చక్కగా రావడానికి కారణమైన కామినేని శ్రీనివాస్‌గారికి మా టీమ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాకి సునీల్‌గారు, అనసూయగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. అనసూయగారు వారి తండ్రిగారు మృతి చెందినా కూడా.. షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా పంచుకోవాలని ఉంది. మా అన్నయ్య శివశంకర్‌గారు సినిమా నిర్మించాలని ముందుకు వస్తున్నప్పుడు భయపడ్డాం. కానీ ఆయన క్షమశిక్షణ, పట్టుదల మాకు తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేశాం. అందరి సపోర్ట్‌తో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టానికి తగినట్లుగానే ప్రేక్షకులు మాకు సక్సెస్‌ను ఇస్తారని భావిస్తున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు..” అని తెలిపారు.
అనసూయ మాట్లాడుతూ.. ”దర్జా మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అల్లు అరవింద్‌గారు, వెంకటేష్‌గారు, సురేష్‌బాబుగారు, రాఘవేంద్రరావుగారు, నవీన్ ఎర్నేనిగారు, బుచ్చిమాయ్య.. వీరంతా ‘దర్జా’ టీమ్‌కు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. నేను షకీల్‌గారిని సంగీత దర్శకుడు అని అనుకోలేదు. నిర్మాత అనుకున్నాను. ఎందుకంటే ప్రతీది తను దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిగారు ఒక బ్యాంకర్‌లా కనిపించేవారు. ఈ పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలైన బ్రదర్స్ ఎంతగానో సినిమా కోసం కష్టపడ్డారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే సినిమాను తీశారు. శివశంకర్‌గారికి, రవిగారికి థ్యాంక్యూ. అలాగే కామినేని శ్రీనివాస్‌గారు ఎంతో సపోర్ట్ ఇస్తూ వచ్చారు. దర్శకుడు మాక్.. ఎప్పుడూ కంగారుగా ఉండేవారు. ఇప్పుడు కాస్త వైట్ డ్రస్సులో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ సినిమాకు పని చేసిన సునీల్ గారు, శిరీష, అక్సా, షమ్ము, సమీర్, షఫీ ఇలా అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎందరో ఈ సినిమాలో నటించారు.. అందరికీ ఆల్ ద బెస్ట్. డిఓపీ దర్శన్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే అంజి మాస్టర్‌కి థ్యాంక్యూ. ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. జోక్స్ పార్ట్ పక్కన పెడితే.. ఇది అద్భుతమైన సినిమా. థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకండి. థియేటర్‌లో జూలై 22న వస్తున్న ఈ సినిమా చూడండి. థ్యాంక్యూ ఆల్” అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో షమ్ము, అక్సాఖాన్, శిరీష వంటి వారు మాట్లాడుతూ.. వచ్చిన అవకాశానికి సంతోషంగా ఉన్నామని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమాకు తను అందించిన సహకారం గురించి తెలిపారు.