Actor Sivaji: అంగరంగ వైభవంగా నటుడు శివాజీ పుట్టినరోజు వేడుకలు

దశాబ్దాల పాటు తన చలనచిత్ర ప్రయాణంతో ఎంతోమంది మనసులలో చోటు సాధించి తన నటనతో, స్ఫూర్తితో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు ప్రయాణం చేసే నటుడు శివాజీ పుట్టినరోజు వేడుకలను తెలుగులో చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా వేడుక చేసుకుంటుంది.

తన నటనతో, నటన శైలితో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ తనదైన మార్క్ సృష్టించుకుని ఎన్నో చిత్రాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరగా ఫీల్ అయ్యే విధంగా పాత్రలను పోషిస్తూ ముందుకు సాగే వ్యక్తి శివాజీ. నటన పట్ల ఆయనకు ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివాజీ ఆ తరువాత మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, సందడే సందడి వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అదేవిధంగా కొన్ని చిత్రాలలో తనదైన మార్కెట్ సృష్టిస్తూ మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. ఇటీవలే కోర్టు చిత్రం ద్వారా మంగపతిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ చిత్రంలో శివాజీ క్యారెక్టర్ చూసిన వారంతా ఆయన నటనను ఎంతగానో కొనియాడారు. నేడు నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దానిని చూసిన అభిమానులంతా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇలాగే మరొకటి శివాజీ తన యాక్టింగ్ కెరియర్లో అలాగే నిర్మాతగా ముందుకు వెళ్తూ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలుపుతున్నారు.

ఆంధ్రలో EVM హ్యాక్ || Analyst Chinta Rajasekhar EXPOSED EVM Tampering In Ap Elections 2024 || TR