Ntr: సీనియర్ నటుడు దివంగత నేత నందమూరి తారక రామారావు సినిమాలలోను రాజకీయాలలోని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చారు అయితే ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీకి నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు అధిపతి అయ్యారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక నందమూరి తారక రామారావు తర్వాత ఈ పార్టీ పగ్గాలు నందమూరి వారసుల చేతిలోనే ఉండాలని ఎంతో మంది అభిమానులు భావించారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ తన చేతులలోకి తీసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా ఈ విషయం గురించి మాట్లాడారు.
నందమూరి తారక రామారావు మరణించిన ఆయన చేసిన సినిమాలో ఆయన పెట్టిన రాజకీయ పార్టీ రూపంలో బ్రతికే ఉన్నాయని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా తన తోడల్లుడు చంద్రబాబు నాయుడుతో మాటలు లేనటువంటి వెంకటేశ్వరరావు ఇటీవల కాలంలో ఇద్దరు మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించుకొని ఒకటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి .
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తారా అంటే తన తలరాతలో రాసిపెట్టి ఉంటే కచ్చితంగా వస్తారని తెలిపారు.ఎన్టీఆర్ వారి తాత నట వారసత్వం అందిపుచ్చుకున్నాడు రాసి పెట్టి ఉంటే రాజకీయ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకుంటారని తెలిపారు.. జూనియర్ ఎన్టీఆర్ అయినా అంతే ఎవరైన అంతే వారికీ రాసిపెట్టి ఉండి కష్టం తోడైతే రాజకీయాల్లో వస్తారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద స్పందించారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.