AP: చంద్రబాబుతో అదే గొడవ… 30 ఏళ్ళు మాటల్లేవ్… ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు: వెంకటేశ్వరరావు

AP: ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ప్రముఖ డాక్టర్ సినీ రచయిత వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఇక పు రందేశ్వరి కూడా తండ్రి బాటలోని రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటూ రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా సరదాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో గత 30 సంవత్సరాలుగా మాటలు లేకపోవటం గురించి ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.

అక్కచెల్లెల్లు భువనేశ్వరి, పురందేశ్వరి మధ్య కూడా మాటల్లేవు అలాంటిది ఇటీవల ఎన్నికల సమయంలో వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు కలిసి పోవడంతో తెలుగుదేశం అభిమానులు సంతోషించారు. ఈ విబేధాలు రావడానికి గల కారణాలను వెంకటేశ్వరరావు తెలిపారు.

30 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరరావు ఇద్దరు ఒకే వేదికపై కలిసిన సంగతి తెలిసిందే. అయితే గత 30 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవని వెంకటేశ్వరరావు తెలిపారు.ముప్పై ఏళ్ళు మాట్లాడుకోలేదు కానీ ఒక సమయంలో కలిసిపోవాలి ఆ సందర్భం వచ్చింది. అలా వచ్చినపుడు దాన్ని అంగీకరించే మ్యాచురిటీ కూడా ఉండాలి అంటూ చెప్పారు.

తన మామ ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ తీర్మానం నన్ను చేయమని చంద్రబాబు అడిగాడు. కానీ నేను చేయలేనని చెప్పాను. ఆ సమయంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక మామ చనిపోయేముందు చెప్పిన చివరి మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన చివరిగా నాతో మాట్లాడుతూ… సెంట్రల్ పాలిటిక్స్ తాను చూసుకుంటానన్నట్లుగా చెప్పారు. ఆయన బ్రతికి ఉంటే ఆ ఎన్నికల్లో గెలిచి పీఎం అయ్యే అవకాశం ఉండేది. అప్పుడు కర్ణాటక నుండి దేవేగౌడ పీఎం అయ్యారు. టీడీపీ సపోర్ట్ తోనే అయ్యారు. ఆయన నాతో ఇది ఎన్టీఆర్ సీట్ అంటూ పీఎం కుర్చీ గురించి చెప్పారు. ఆయన బ్రతికి ఉంటే ఆయనదే ఈ కుర్చీ అంటూ చెప్పారు ఆయన బ్రతికే ఉంటే పీఎం అయి ఉండే వారంటూ వెంకటేశ్వరరావు తన మామయ్య ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను తెలిపారు.