NTR: నందమూరి తారక రామారావు కుమారుడు హరికృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రెండో పెళ్లికి కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా చేసుకోవడంతో తన రెండో భార్యను నందమూరి కుటుంబం తన ఫ్యామిలీలోకి చేర్చుకోలేదు తనని దూరం పెడుతూ వచ్చారు.. ఇక హరికృష్ణ షాలిని దంపతులకు ఎన్టీఆర్ జన్మించినప్పటికీ కూడా చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీకి చాలా దూరంగా పెట్టారు. అయితే ఎలాగైనా తన ఇంటిపేరును సంపాదించుకోవడం కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడుతూ సినిమాలలో ఉన్నత స్థాయికి చేరుకొని నందమూరి అనే పేరును పక్కన చేర్చుకున్నారు.
ఇలా నందమూరి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ను దూరం పెట్టారని, ఇప్పటికి కూడా నందమూరి ఫ్యామిలీ తనని దూరమే పెట్టారని తెలుస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మేనత్త పురందరేశ్వరి మాట్లాడుతూ సంచలన విషయాలబయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఈమె తెలిపారు కానీ ఆ కారణం ఏంటో మాత్రం బయట పెట్టలేదు. వాటి గురించి ఇప్పుడు చర్చించాల్సిన పనిలేదు కారణాలు అయితే ఉన్నాయని అందుకే దూరం పెరిగిందని కానీ ఇప్పుడు అంతా కలిసే ఉంటున్నామని తెలిపారు.
ఇక ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడం గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు పురందేశ్వరి సమాధానం చెబుతూ ఎన్టీఆర్ వయసు ఇంకా చాలా చిన్నది రాజకీయాలలోకి రావాలనుకుంటే కచ్చితంగా వస్తారు. రాజకీయాల గురించి తన మనసులో ఏముందో నాకు తెలియదని పురందేశ్వరి తెలిపారు. ఇక ఎన్టీఆర్ తో తనకు చాలా మంచి అనుబంధం ఉందని నన్ను అత్త అని పిలుస్తారని మా పిల్లలతో రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారని కూడా తెలిపారు. ఇక ఎన్టీఆర్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే మంచి సక్సెస్ కావాలని కోరుకుంటాను సినిమా బాగుంటే తనకు ఫోన్ చేసి మరి చెబుతాను అని పురందేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.