హనీట్రాప్ కి గురవుతున్న యువకులు.. డబ్బులు డిమాండ్ చేస్తున్న సైబర్ ముఠాలు..?

ఒక యువకుడికి హాయ్ నా పేరు సుజి. నీ పేరు చెప్పు, నేను సింగిల్ అంటూ ప్రవీణ్ అనే యువకుడికి మెసెంజర్ లో ఒక మెసేజ్ రాగా, పేరు కొత్తగా ఉండటంతో పాటు అందమైన అమ్మాయి ఫోటో డిపిగా ఉండటంతో మెసెంజర్ ఓపెన్ చేసి తాను కూడా చాట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ యువకుడికి ఆ యువతి నీ ఫోన్ నెంబర్ చెప్పు వీడియో కాల్ చేస్తాను అనడంతో ఆ యువకుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఫోన్ నెంబర్ పంపాడు. ఇక సెకండ్ల వ్యవధిలోనే కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. మొదట అందమైన యువతి వీడియో కాల్ కి వచ్చి హాయ్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడగా.. ఆ యువకుడు కూడా వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడాడు.

తర్వాత ఆ యువతి అసభ్యకరంగా మాట్లాడుతూ, దుస్తులు తొలగించడం లాంటివి చేస్తూ, ఆ యువకుడిని కూడా అలాగే చేయమని చెప్పడం తో అతను కూడా ఆమె చెప్పిన విధంగా చేశాడు. కొద్దిసేపటికి వీడియో కాల్ కట్ అవ్వగానే అతడికి వాట్సాప్ లో వీడియో లతో పాటు, వెంటనే మెసేజ్ లు రావడం మొదలయ్యాయి. ఇక వాటిని చూడగానే ఒక్కసారిగా ప్రవీణ్ బిత్తరపోయాడు. అప్పటివరకు ఆ యువతి తో మాట్లాడిన మాటలు అన్ని కూడా రికార్డ్ చేసి అతనికి పంపించారు. గూగుల్ పే నెంబర్ కి 50,000 పంపించు లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకు పంపిస్తాను వరుసగా మెసేజ్ లు రావడంతో ప్రవీణ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు.

చివరికి దగ్గరికి మిత్రుడు సలహాతో వారి ఫోన్ లిఫ్ట్ చేయడం మెసేజ్ లు చూడటం కూడా చేయడం లేదు. ఘటన జరిగి రెండు రోజులు అయినా దాన్నుంచి ప్రవీణ్ కోలుకోలేదు. ఒక ప్రవీణ్ మాత్రమే కాకుండా చాలామంది ఇలా హనీట్రాప్ గురవుతున్నారు. పలురకాల సైబర్ ఉచ్చుల తో పలు ముఠాలు వివిధ వయసుల వారిని టార్గెట్ చేస్తూ మాయ మాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అనంతరం ఆ యువకులు నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోజురోజుకీ హనీట్రాప్ లో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయం పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండమని చూపిస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 28 ఏళ్ళ లోపు ఉన్న యువతనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.