హైపర్ ఆదికి కరెంట్ షాక్..షోలో గట్టిగా అరిచిన ఆది..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి పై వరుసగా పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు యూట్యూబ్ లో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మామూలుగానే హైపర్ ఆది తన పంచులతో రెచ్చి పోతూ ఉంటాడు. ఇక అలాంటి హైపర్ ఆది సుడిగాలి సుధీర్ తోడైతే ఇక పంచులు వర్షం కురిపిస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే ఢీ షోలో హైపర్ ఆది తన పంచులతో ప్రేక్షకులను నవ్వించాడు. ఇక తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా అందులో హైపర్ ఆది కి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సూపర్ సినిమాలో బ్రహ్మానందం ఆలీ కామెడీ సీన్ గురించి మనకు తెలిసిందే. అందులో లై మిషన్ అంటూ ఆలీకి బ్రహ్మానందం ఇచ్చే ట్రీట్మెంట్ సన్నివేశం ఎంతలా వర్కౌట్ అయింది తెలిసిందే. అదే కామెడీ సీన్ ఢీలో రిపీట్ చేశారు. జూన్ 1 న ప్రసారం కానున్న షో కి అడవిశేషు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగింది అంటూ అడవి శేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో హైపర్ ఆది ఇంటికి వస్తాడు. అప్పుడు హైపర్ ఆది కి లై మిషన్ పెడతారు. అయితే మరి అప్పుడు హైపర్ ఆది కి నిజంగానే కరెంట్ షాక్ ఇచ్చారా? లేకపోతే హైపర్ ఆది అలా పర్ఫామెన్స్ చేస్తున్నాడా అన్నది అర్థం కావడం లేదు. కానీ హైపర్ఆది ఇచ్చే రియాక్షన్ లను బట్టి చూస్తుంటే నిజంగానే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైపర్ ఆదికి లై మిషన్ పెట్టి ఒక్కొక్కటిగా ప్రశ్నలు అడుగుతుండగా అబద్ధం చెప్పినప్పుడు ఆ మిషన్ కరెంట్ షాక్ కొడుతుంది. ఈ క్రమంలోనే ఢీ షోకి ఎలా వచ్చావ్ అని ప్రదీప్ అడుగగా..మెట్లు ఎక్కి వచ్చాను అని కౌంటర్ వేయడంతో గట్టిగా షాక్ ఇస్తారు. ఆ తరువాత నీ మొబైల్ లో ఎంత మంది అమ్మాయిల నెంబర్ లు ఉన్నాయి అని అడగగా రెండు అని సమాధానం ఇవ్వడంతో గట్టిగా షాక్ ఇస్తారు. అలా ఆది అపద్దాలు చెప్పిన ప్రతి సార్ షాకులు ఇస్తూనే ఉంటారు. ఇక జానీ మాస్టర్ అయితే అబద్దం అని అంటూనే ఉంటాడు.నీ వయసు ఎంత అని అడిగితే కావాలనే ఆది 16 అని అనడంతో ఈసారి షాక్ మరింత ఎక్కువగా ఇస్తారు. ఇక ఆది భార్యగా నటించిన తేజస్వినికి కూడా గట్టిగానే షాక్ ఇవ్వడంతో తేజస్విని గట్టిగా ఒక అరుపు అరుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.