ఉద్యోగ నియామకాలపై తెలంగాణ సీఎస్ సమీక్ష

somesh kumar

ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా పలు శాఖల అధికారులతో సీఎస్‌ సోమేశ్​కుమార్​ భేటీ అయ్యారు. ఉద్యోగ నియామకాలపై ఆర్థిక, సాధారణ పరిపాలన, విద్య, వైద్య, హోం శాఖల కార్యదర్శులతో సోమేశ్​కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా 80 వేల 39 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు