Crime: పిల్లలను బావిలో పడేసి ఆపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్..!

Crime: సాధారణంగా వారికి ఏ కష్టం వచ్చినా తమ పిల్లలు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు. కానీ ఈ తండ్రి మాత్రం తనకు కష్టం వచ్చిందని తన పిల్లలను కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ గా పనిచేస్తున్న రామ్ కుమార్ తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం…

ముంబైలో సీఆర్పీఎఫ్ జవాన్ గా విధులు నిర్వహించిన రామ్ కుమార్ సెలవు నిమిత్తం సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఇలా చాలా నెలల తర్వాత ఇంటికి రావడంతో ప్రేమగా అతనితో ఉండాల్సిన భార్య అతనితో ఘర్షణకు దిగింది. ఇలా భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో రామ్ కుమార్ భార్య తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది.ఇలా తన భార్యా పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లడంతో మరుసటి రోజు ఉదయం రామ్ కుమార్ తన అత్తగారి ఇంటికి వెళ్లి తన పిల్లలను
అమ్మి జాక్సన్, జానీ బేస్టోలను తనతోపాటు బండి పై బయటకు తీసుకెళ్లాడు.

సరదాగా పిల్లలని బయటకు తీసుకెళ్తున్నారని కుటుంబసభ్యులు భావించారు కానీ రామ్ కుమార్ తన ఇద్దరు పిల్లలని పొలానికి తీసుకెళ్లి పొలం దగ్గర ఉన్న బావిలో పడేసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా
రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇలా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.