Crime News: ప్రస్తుత కాలంలో ఖర్చులు పెరిగిపోవడంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . ఉద్యోగాల నిమిత్తం సిటీస్ లో ఉండి ఉద్యోగాలు చేసేవారు వారి పిల్లల ఆలనా పాలనా చూసే వారు లేక వారిని కేర్ టేకింగ్ సెంటర్లలో జాయిన్ చేయించడం లేదా పిల్లల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ నీ అపాయింట్ చేసుకోవడం బాగా పెరిగిపోయింది. సంపాదనలో పడి పిల్లల్ని ముక్కు ముఖం తెలియని వారి చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది కేర్ టేకర్ పిల్లల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మాటలు కూడా రాని ఆ పసికందులను దారుణంగా హింసిస్తున్నారు. అటువంటి విషాదకర ఘటన ఇటీవల సూరత్ లో చోటు చేసుకుంది.
సూరత్‌లోని రాండెర్ పలాన్‌పూర్ పటియాలో నివసించే దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులే కావడంతో ఉద్యోగాల నిమిత్తం పిల్లల్ని చూసుకునే సమయం లేక వారిద్దరూ వారు ఎనిమిది నెలల చిన్నారిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ నియమించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆ ఇంటి నుండి చిన్నారి అరుపులు ఎక్కువ గా వినిపించడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి ఆ చిన్నారి తల్లిదండ్రులకి సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్ చూసి తల్లడిల్లిపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కేర్ టేకర్ తమ చిన్నారి పట్ల ప్రవర్తించిన తీరును చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీసీటీవీ ఫుటేజ్ లో కేర్ టేకర్ 8 నెలల చిన్నారి ని ఏమాత్రం దయ లేకుండా కొట్టడం, గిచ్చడం చిన్నారి తలని మంచానికి వేసి కొట్టి చిన్నారి ఏడుపును ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
కేర్ టేకర్ తను కూడా ఒక ఆడది అన్న విషయం మర్చిపోయి పిల్లల పట్ల ప్రేమను చూపించకుండా ఆ చిన్నారిని క్రూరంగా హింసించింది. మాటలు కూడా రాని ఆ పసికందును అలా హింసించడానికి ఆమెకు మనసు ఎలా వచ్చిందో. ఆ చిన్నారిని తల్లితండ్రులు హాస్పిటల్ కి తీసుకెళ్లగా చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారి తలని మంచానికి కొట్టడంతో తలలో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు కేర్ టేకర్ ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. డబ్బు సంపాదనలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.