Prabhas : ప్రభాస్ ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఏమిటంటే.!

Prabhas : బాహుబలి రెండు సినిమాలతో కూడా పాన్ ఇండియా ఇమేజ్ ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇక్కడ నుంచి ప్రభాస్ ఒక్కో సినిమాతో ఒకో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమాకి పరిచయం అవుతున్నాడు. మరి ఇదిలా ఉండగా తాను ఇప్పుడు ఓ ప్రపంచ స్థాయి సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

‘మహానటి’ దర్శకుడు నాగశ్విన్ తో చేయబోతున్న భారీ పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే” గత కొన్ని నెలల కితం అధికారికంగా స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దీనిపై తాజా అప్డేట్ తెలుస్తుంది. గత కొన్ని రోజులు కితమే ఏకంగా ఏడు ఎకరాల్లో ఈ సినిమా భారీ సెట్టింగ్స్ నడుమ స్టార్ట్ కాగా ఇప్పుడు ఈరోజు సెట్స్ లోకి మొదటి సారిగా ప్రభాస్ అడుగు పెట్టబోతున్నాడట.

దీనితో సోషల్ మీడియా అంతా ఇప్పుడు రచ్చ లేస్తుంది. సెట్స్ నుంచి ప్రభాస్ ది ఒక్క ఫోటో అయినా వస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో దీపికా పదుకొనె మరో బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్ లు కూడా నటిస్తుండగా అశ్వనీ దత్ ఈ సినిమాకి మినిమమ్ 500 కోట్లు నుంచి బడ్జెట్ స్టార్ట్ చేశారు.