Bheemla Nayak : “భీమ్లా నాయక్” రిలీజ్ పై క్రేజీ గాసిప్స్.. ఇదే నిజం అయితే వేరే లెవెల్లో ఉంటుంది.!

Bheemla Nayak : టాలీవుడ్ నుంచి వస్తున్న పలు కేజ్రీ మల్టీస్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. ఒరిజినల్ గా మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మరి తెలుగులో పెద్ద ఎత్తునే మార్పులు చేర్పులు చేయబడ్డాయి చిత్రాన్ని యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. మరి మాస్ ఆడియెన్స్ మరియు పవన్ అభిమానుల్లో ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తుంది. అయితే ఈ లేటెస్ట్ గాసిప్ గాని నిజం అయితే సినిమా వేరే లెవెల్లో ఉన్నట్టే అని చెప్పాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని మేకర్స్ ఒక్క తెలుగు లోనే కాకుండా మరో రెండు భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో హిందీ భాష కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఇది జస్ట్ టాక్ మాత్రమే అలాగే ఇంకో భాష తమిళ్ గాని కన్నడ గాని అయ్యుండొచ్చు అని తెలుస్తోంది.
అయితే పవన్ ఇదివరకే హిందీ ప్రయోగం చేసాడు కాని అది అంతగా వర్కవుట్ కాలేదు.

కానీ ఇప్పుడు తెలుగు సినిమా స్టేటస్ పెరిగింది కాబట్టి ఈ సినిమాని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసి వదిలితే మినిమం అయినా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఎలాగో తర్వాత పవన్ నుంచి హరిహర వీరమల్లు అనే భారీ పాన్ ఇండియన్ సినిమా కూడా ఉండడంతో భీమ్లా నాయక్ ముందే హింది అయితే కొంచెం బూస్టప్ లా కూడా వుంటుంది. మరి వేచి చూడాలి ఫైనల్ గా ఈ సినిమా విడుదల ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.