Project K : క్రేజీ ఇన్ఫో : ప్రభాస్ వరల్డ్ “ప్రాజెక్ట్ కె” లో ‘కె’ అర్ధం ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ గ్యారెంటీ.!

Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా అయినటువంటి “రాధే శ్యామ్” బిగ్ స్క్రీన్ పై ఎందుకో క్లిక్ అవ్వలేదు. దీనితో ఇండియన్ సినిమా దగ్గర భారీ ప్లాప్ గా ఈ చిత్రం నిలిచిపోయింది. అయితే ఈ సినిమా ఫలితం పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలు మాత్రం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని పేకాట ఆడేయడం ఖాయం అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ధీమాగా ఉన్నారు.
అయితే ఈ చిత్రాల్లో ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా మన దేశ సినిమా నుంచే వస్తున్న ప్రపంచ స్థాయి సినిమా “ప్రాజెక్ట్ కె”. యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఒక క్రేజీ సమాచారం బయటకి వచ్చింది. ఇది తెలిస్తే ఒకరకంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని చెప్పాలి. మరి లోతుగా వెళ్లినట్లు అయితే ఈ సినిమాని ప్రస్తుతం ప్రాజెక్ట్ కె గా పిలుస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాకి ప్రాజెక్ట్ కె అనే ఎందుకు పెట్టారు అంటే ఈ సినిమాలో పురాణాల నేపథ్యం కూడా తీసుకోబడింది అట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అట. ఇది సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన మూలకారణం మాత్రం మన దేశపు పురాణం అని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రాజెక్ట్ కె అంటే ఇక్కడ “కల్కి” అట. “ప్రాజెక్ట్ కల్కి” అని నామకరణం చేసినట్టుగా ఇప్పుడు క్రేజీ సమాచారం.
అయితే ఈ సినిమాలో నేపథ్యంని దర్శకుడు చాలా కొత్తగా తీసుకున్నా పురాణాలకి సంబంధించి ఎలా లింక్ చేశారు అనేది మరింత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇదే ఈ సినిమాపై లేటెస్ట్ క్రేజీ సమాచారం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మినిమం బడ్జెట్ గా ఈ చిత్రాన్ని అశ్వని దత్ 500 కోట్ల వ్యయంతో ఈ భారీ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.