Crazy Bahubali 2 : ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి అత్యధిక వసూళ్లు అందుకున్న బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో అన్ని మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి వెళ్ళినవే ఉన్నాయని చెప్పాలి. ఒక్క ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర లెక్కల ప్రకారం అయితే మొదట వరసలో బాహుబలి 2 సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ గా చరిత్ర సృష్టించగా దాని తర్వాత ఇప్పుడు మరో లేటెస్ట్ భారీ సినిమాలు ట్రిపుల్ ఆర్(RRR) మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు నిలిచాయి.
సరే ఇది అంతా బాగానే ఉంది అప్పట్లో బాహుబలి 2 నెలకొల్పిన ప్రకంపనలు ముందు మరే సినిమా నిలబడదు అనుకునే రేంజ్ లో దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ఆ సినిమాని చూసారు. మరి ఈ సినిమా అందుకున్న ఆదరణ మళ్ళీ ఏ సినిమాలు అందుకుంటాయా అనే దానికి రాజమౌళి RRR మరియు కేజీఎఫ్ 2 సినిమాలు సమాధానం చెబుతాయి అని చాలా మంది భావించారు.
అందుకు తగ్గట్టే ఈ రెండు సినిమాలు కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్నాయి కానీ ఫైనల్ గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు కలిసినా బాహుబలి 2 సెట్ చేసిన ఒక క్రేజీ అండ్ బిగ్గెస్ట్ రికార్డుని అందుకోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే ఫుట్ ఫాల్స్ విషయంలో అట.
బాహుబలి 2 సినిమాకి ఏకంగా 10 కోట్లకి పైగా ఫుట్ ఫాల్స్ రాగా ఇప్పుడు ఈ RRR మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ సినిమాలు వచ్చినా ఆ రెండు కలిపి 7 కోట్లకి వచ్చాయట. అంటే ఒక్క బాహుబలి 2 సినిమానే ఏ రకమైన ప్రభంజనం నమోదు చేసిందో అర్ధం చేసుకోవాలి. అయితే ఇంకా ఈ రెండు సినిమాలకి రన్ అయితే కొనసాగుతుంది కానీ ఒక్క సినిమానే బాహుబలి 2ని బీట్ చెయ్యడం అయితే ఇంపాజిబుల్ అనే చెప్పాలి.
గమనిక ఇక్కడ ఫుట్ ఫాల్స్ అంటే దేశంలో ఆయా సినిమాలకి తెగిన అన్ని రకాల రేట్ల టికెట్లు సంఖ్యగా పరిగణిస్తారు, దీనినే ఫుట్ ఫాల్స్ అంటారు. అంటే బాహుబలి 2 కి మన దేశ వ్యాప్తంగా 10 కోట్లకి పైగా టికెట్లు తెగగా కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు రెండిటికి కలిపి 7 కోట్లు తెగాయి. ఇక మీరే అర్ధం చేసుకోవచ్చు ఆ లెక్కలు..