రంగులు మార్చే ఊసరవెల్లి అట.. చిల్లర బేరగాడు అట.. బ్రోకర్ కూడానట.! అసలేమయ్యింది సీనియర్ పొలిటీషియన్, ఎర్రదండు నాయకుడు నారాయణ అలియాస్ సీపీఐ నారాయణకి.?
చిరంజీవి రాజకీయాల్లో లేరు, ఆయన్ని రాజకీయంగా విమర్శించాల్సిన పనిలేదు. కానీ, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వ్యవహారం పేరుతో మెగాస్టార్ చిరంజీవి మీద దూషణలకు దిగేశారు నారాయణ. దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని బహుశా నారాయణ కనిపెట్టేసినట్టున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, ఆ కార్యక్రమానికి చిరంజీవి ఆహ్వానం అందుకున్నారు.. ఆ ఆహ్వానాన్ని మన్నించి, భీమవరం వెళ్ళారు.. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ నారాయణకు కలిగిన నొప్పి ఏంటట?
ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. బహుశా పాత మిత్రుడు చంద్రబాబు మీద ప్రేమతోనో, కుల గజ్జి కారణంగానో నారాయణ ఇలా మాట్లాడి వుంటారని అనుకోవచ్చా.? అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ప్రజా సమస్యలపై పోరాటాలు, ప్రజల కోసం నినదించడాలు.. ఇవన్నీ గత చరిత్ర అయిపోయినట్టుంది.
లేకపోతే, నారాయణ ఇలా ఎలా మాట్లాడగలరు.? సరే, సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించకపోవడం నిర్వాహకుల తప్పిదం. దానికి చిరంజీవి ఏం చేస్తారు.? ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి హాజరయిన కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి హోదాలోనో, మెగాస్టార్ హోదాలోనో చిరంజీవి ఆహ్వానం మేరకు వెళితే, దాన్ని ఇంతలా తప్పు పట్టడమా.?
ఓసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకోసారి టీడీపీకి కొమ్ము కాసిన నారాయణ, రాజకీయాల్లో రంగులు మార్చడం గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?