టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడే ఊపందుకుంది. షూటింగ్స్ సజావుగా సాగుతున్నాయి. సినిమాలు పెద్ద ఎత్తున రిలీవుతున్నాయి. అంతా గాడిలో పడింది అనుకుంటుండగా మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వైరస్ సోకింది. ఇక్కడ చిత్రం ఏమిటంటే అల్లు అరవింద్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక కూడ ఆయనకు పాజిటివ్ అని తేలింది.
అంటే ఆయన మీద వ్యాక్సిన్ పనిచేయలేదన్నమాట. టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారిలో వ్యాక్సిన్ పనిచేయని మొదటి వ్యక్తి అల్లు అరవిందే. వ్యాక్సిన్ తీసుకోగానే సింప్ట్మ్స్ కనిపించకపోతే వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెందనట్టే లెక్క. అలాంటివారు కరోనాకు గురయ్యే అవకాశం ఉంది. అరవింద్ విషయంలో ఇదే జరిగింది. ఆయన మీద వ్యాక్సిన్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక మరొక సెలబ్రిటీ నివేత థామస్ సైతం కరోనాకు గురైంది.