కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ఖచ్చితంగా ఫలానా మెడిసిన్ అందిస్తే రోగం నయమవుతుందన్నది ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదు. లక్షణాల్ని బట్టి మాత్రమే వైద్యం చేస్తున్నారు.. ప్రభుత్వాసుపత్రుల్లోనూ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఈ వైద్యానికే వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చవుతోంది. కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా వున్నవారికి ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం వుంది గనుక, వారికి చికిత్స కష్టమవుతోంది.. అక్కడే లక్షలకు లక్షలు గుంజేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. ‘మీ ఆరోగ్య పరిస్థితి ఇదీ.. పరిస్థితి విషమరించే అవకాశం వుంది కాబట్టి.. ఈ ఖరీదైన చికిత్సకు ముందే సిద్ధమైపోండి..’ అంటూ కొందరు వైద్యులు, ముందే కరోనా బాధితుల్ని భయపెట్టి.. లక్షలు దోచేస్తున్నారన్న విమర్శ వుండనే వుంది. ఉత్త విమర్శ కాదిది.. జరుగుతోన్నది అదే. సరిగ్గా ఈ సమయంలో కరోనా వైరస్ మీద పోరాటం కోసం ఓ ఆయుర్వేద మెడిసిన్.. అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా క్రిష్టపట్నం అనే ఓ గ్రామానికి చెందిన ఆనందయ్య అనే వ్యక్తి ముందుకొచ్చాడు. వందలాదిమంది.. వేలాదిమంది ఆయన వద్దకు పరుగులు పెట్టారు.
చాలామంది కోలుకున్నారట కూడా. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అది శాస్త్రీయం కాదు.. అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. మరి, ఏది శాస్త్రీయం.? కరోనా వ్యాక్సినేషన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.. దీనికి శాస్త్రీయత ఏంటి.? అన్నీ అత్యవసర వినియోగం కింద వాడుతున్నవే. రెమిడిసివిర్ వంటి ఖరీదైన మందులూ అంతే. వాటికి శాస్త్రీయత ఏదీ.? పైగా, వ్యాక్సినేషన్ ద్వారా రెమిడిసివిర్ వినియోగం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వుంటున్నాయని వింటున్నాం. అనంతయ్య విషయంలో అలాంటి దుష్ప్రభావాలేవీ వున్నట్టు తేలలేదు. నిజానికి, ఇలాంటివాటినే వీలైనంత త్వరగా జనంలోకి తీసుకెళ్ళాలి.. ఎందుకంటే దుష్ప్రభావాల్లేవని అధికారులే చెబుతున్నారు కదా.?