కరోనా వైరస్.. ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందా.?

Corona Virus (Covid 19): Unsolved Myster For Ever?

Corona Virus (Covid 19): Unsolved Myster For Ever?

అసలు కరోనా వైరస్ అంటే ఏంటి.? ప్రస్తుతం చలామణీలో వున్న కోవిడ్ 19 సంగతేంటి.? ఈ అంశంపై చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి.. చాలా పరిశోధనలూ జరుగుతున్నాయి. వైరస్ పుట్టుకని కనుగొనడం అంత తేలిక కాదు. అలాగని అసాధ్యమూ కాదు. ప్రపంచం చాలా వైరస్‌లను చూసింది. వందల కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల వైరస్‌లతో మనం సహజీవనం చేస్తున్నాయి. కొన్ని మాత్రమే మానవాళిని ఇబ్బంది పెడుతుంటాయి. అందులో చాలా కొన్ని మాత్రమే మిస్టరీలుగా మిగిలిపోతాయి. కరోనా వైరస్‌గా పిలుస్తున్న కోవిడ్ 19 కూడా అంతేనా.? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు అమెరికా సహా చాలా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ వైరస్ చైనాలో పుట్టిందన్నది నిర్వివాదాంశం. కానీ, అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చింది.? ఎవరు తీసుకొచ్చారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దీన్ని తయారీ వైరస్‌గా కొందరు పరిశోధకులు అభివర్ణిస్తుండడం గమనార్హం. వైరస్ పుట్టుక గురించి తెలిస్తే, దానికి వైద్యం తేలికవుతుంది. నిజానికి, కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఇబ్బంది కలిగిస్తోంది. కొందర్ని తేలిగ్గానే వదిలేస్తోంటే, కొందర్ని తీవ్రంగా బాధపెడుతోంది. వైరస్ తీరు వైద్య శాస్త్ర నిపుణులకే అర్థం కావడంలేదు. ఇంత వేగంగా మ్యుటెంట్లు జరిగిన వైరస్ ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తోంటే, వైరస్ మీద పరిశోధనలు ఇంకో పదేళ్ళు ఇలాగే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వ్యాక్సిన్ల వల్ల ఉపశమనం పొందుతుంది తప్ప, పూర్తి భద్రత లభించబోదన్నది వైద్య నిపుణులు చెబుతున్నమాట. వైరస్ అనేక రకాలుగా మ్యుటేట్ అవుతున్న దరిమిలా, వ్యాక్సిన్లతో ప్రయోజనం లేదనీ వైద్యులే చెబుతున్నారు. అయితే, వ్యాధి తీవ్రత తగ్గించడంలో వ్యాక్సిన్ దోహదపడుతుంది గనుక, వ్యాక్సినేషన్ ప్రపపంచ వ్యాప్తంగా మరింత వేగంగా జరగాల్సిన అవసరం వుంది. కానీ, ఇలా ఎన్నాళ్ళు.? అసలు కరోనా వైరస్ మిస్టరీ వీడుతుందా.? లేదా.? వీడే అవకాశాలైతే కన్పించడంలేదు.