Florona Double Infection: కొత్త సంవత్సరంలో ముంచుకొస్తున్న మరో కొత్త కరోనా వేరియంట్.. డబుల్ ఇన్ఫెక్షన్.!

Florona Double Infection: కరోనా మహమ్మారి రకరకాలుగా మ్యూటేట్ అవుతూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ ను వైద్యులు గుర్తించారు. గర్భం దాల్చిన ఒక మహిళలో.. కరోనా, ఇన్ఫ్లూయెంజా వైరస్ లతో కూడిన డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది. ఈ రెండు వైరస్ లు కలిపి ఎటాక్ చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. తాజాగా కనుగొన్న ఈ కొత్తరకం కరోనా వేరియంట్ కి ‘ఫ్లోరోనా’ అని నామకరణం చేసారు. ఈ వేరియంట్ మనుషుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అనే విషయం పైన పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం, ఫ్లోరోనా వైరస్ అనేది డెల్టా లేదా ఒమిక్రాన్ వంటి కొత్త కరోనా జాతి వంటిది కాదు. ఫ్లోరోనాతో బాధపడుతున్న రోగిపై కరోనా వైరస్, ఇన్‌ఫ్లుఎంజా వైరస్ రెండూ ఏకకాలంలో కలిపి దాడి చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ సోకిన రోగికి వ్యాధి మరింత తీవ్రతరం అవుతుంది. అంటువ్యాధి ప్రబలడం ప్రారంభమైన తర్వాత ఫ్లోరోనా కేసు నమోదవడం ఇదే మొట్టమొదటిసారి.

కరోనా వైరస్ అనేది మానవుని శ్వాసకోశ వ్యవస్థకు సోకుతుండగా, ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ఇన్‌ఫెక్షన్ అనేది న్యుమోనియా, మయోకార్డిటిస్ వంటి అతి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. రాబోయే కాలంలో రోగుల మరణానికి కూడా దారితీయవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఇజ్రాయెల్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, ఫ్లోరోనా వైరస్ సంక్రమణ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గడిచిన వారంలో, ఇజ్రాయెల్ ఆసుపత్రులు సుమారు 1,849 ఇన్ఫ్లుఎంజా రోగులకు చికిత్స చేశాయి. ఒమిక్రాన్ వేవ్ కారణంగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో ఒమిక్రాన్ వేవ్ వచ్చే మూడు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

ఫ్లోరోనాతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో అనేక లక్షణాలను ఏకకాలంలో చూడవచ్చని… ఇందులో న్యుమోనియా, మయోకార్డిటిస్ ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా సంభవిస్తాయని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారవచ్చుని వెల్లడించారు. ఫ్లోరోనా ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా సోకుతుందని చెప్పారు. దీనికి గల కారణం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తి. రెండు తీవ్రమైన వైరస్లు ఒకేసారి దాడి చేయడం సాధారణం కానందున, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ప్రజల గుండె కండరాలు వాపుకు గురవుతాయని ఫ్లోరోనా వల్ల మనుషులకు ఇంకా ఎలాంటి హాని జరుగుతుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ మోతాదుతో కూడా సురక్షితంగా ఉండే ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ను ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.