Corona: దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన కరోనా కేసులు..?

Corona: దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి కోరలు చేస్తోంది. రోజు రోజుకి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇకపోతే ఇప్పటికే దేశంలోని పలు ప్రదేశాలలో కరోనా తగ్గు ముఖం పట్టింది. కొన్ని ప్రదేశాల్లో మాత్రం కరోనా అలాగే కొనసాగుతోంది. ఇక తాజాగా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కేవలం నిన్న ఒక్కరోజే 6915 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలపగా, వారిలో 180 మంది వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని తెలిపింది. అదేవిధంగా నిన్న కరోనా నుంచి 16,864 మంది కోలుకున్నారు అని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

ఇకపోతే ప్రస్తుతం హాస్పటల్లో, హోమ్ క్వారంటైన్ లలో దాదాపుగా 92,472 మంది చికిత్స తీసుకుంటున్నారు అని తెలిపింది. అలాగే ఇప్పటివరకు 177.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాము అని తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం4,23,24,550 మంది ప్రజలు కోలుకున్నారు అని తెలిపింది. మొత్తంగా చూసుకుంటే రోజువారీ పాజిటివిటి రేటు 0.77 శాతంగా ఉంది.