ఆర్ఆర్ఆర్ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగమా!

Hurdles For RRR Movie Release

ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కోసం తెలుగు సినీ ప్రియులతో ఎంత గానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు. సినిమా చూసిన ఫ్యాన్స్ లో జోష్‌లో ఉన్నారు. అంచనాలకు మించి రాజమౌళి సినిమా తెరకెక్కించారని అంటున్నారు. తారక్ , చరణ్ పోటీపడి నటించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.