వార్నింగ్స్ పనిచేశాయి.. ప్రభాస్ టీమ్ కదిలింది

Continues surprises from Radhe Shyam

Continues surprises from Radhe Shyam

ప్రభాస్ అభిమానుల్లో మరోసారి నిరుత్సాహం ఎక్కువైంది. అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూ ఉంటే ప్రభాస్ ఫాన్స్ మాత్రం ‘రాధేశ్యామ్’ విశేషాల కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలాగే అప్డేడ్స్ విషయంలో వరసగా టైటిల్, బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్, విక్రమాదిత్య, ప్రేరణల లుక్, ఫస్ట్ గ్లింప్స్ ఇలా వరుసగా అప్డేట్స్ ఇచ్చి అభిమానులను కూల్ చేశారు. కానీ ఆతర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు మేకర్స్.

ఇంకో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ ఉంటే ఇంకా టీజర్ కూడ వదలకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అదే పనిగా మేకర్స్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రభాస్ టీమ్ వరసగా సర్‌ప్రైజెస్‌కి ప్లాన్ చేశారట. ఏప్రిల్‌లో రెండు టీజర్స్‌తో పాటు వరుసగా ఐదు పాటల్ని కూడ రిలీజ్ చేస్తారట. ఇక మే నెలలో ట్రైలర్ వదులుతారనే టాక్ కూడ ఉంది. మొత్తానికి అభిమానుల వార్నింగ్స్ ఫలించి ప్రభాస్ నుండి వరుస ట్రీట్స్ వచ్చేలా ఉన్నాయి. యువి క్రియేషన్స్ -గోపికృష్ణ మూవీస్- టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 30న విడుదలచేయనున్నారు.