టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరు. జీవించి ఉన్న సమయంలో తన కామెడీ టైమింగ్ ద్వారా వేణుమాధవ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసిన అతికొద్ది మంది కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరని చెప్పవచ్చు. వేణుమాధవ్ చనిపోయిన సమయంలో ఆస్పత్రి బిల్లులను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్టారనే సంగతి తెలిసిందే.
అయితే ఆ సమయంలో వేణుమాధవ్ కుటుంబం ఆర్థిక కష్టాలను ఎదుర్కొందా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే వేణుమాధవ్ జీవించి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని అన్నారు. మౌలాలీలో సెటిల్ అయిన వేణుమాధవ్ తనకు ఈసీఐఎల్ నుంచి మౌలాలి వరకు 10 ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. కరీంనగర్ లో తనకు పది ఎకరాల భూములు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఆర్థికంగా తాను బాగానే స్థిరపడ్డానని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు. వేణుమాధవ్ అనారోగ్యం వల్ల చిన్న వయస్సులోనే మరణించారు. వేర్వేరు తరాలకు చెందిన స్టార్ హీరోలతో కలిసి నటించిన అతికొద్ది మంది కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరు. వేణుమాధవ్ జీవించి ఉంటే ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉండేవారని ఆయన అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
వేణుమాధవ్ మరణించినా కుటుంబానికి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలలో వేణుమాధవ్ నటించారు. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ పలు సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. వేణు మాధవ్ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలలో నటించారు.