Extra Jabardasth: రష్మి కాళ్ళ పై పడిన కమెడియన్… అందరిముందు గుట్టు రట్టు చేసిన సింగర్ మనో..?

Extra Jabardasth: బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వారంలో రెండు రోజులు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అత్యధిక టిఆర్పి రేటింగ్స్ కూడా వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రతి వారం స్కిట్ లో భాగంగా కమెడియన్స్ వారి స్కిట్ లో భాగంగా అందమైన అమ్మాయిలు లేదా యాంకర్ ల తో వేదిక పై చిందులు వేయడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే ఈ వారం ప్రమోలో భాగంగా రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా యాంకర్ రష్మీతో కలిసి వేదికపై చిందులు వేసాడు. ఇక వేదికపై రష్మీ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వీరిద్దరి పర్ఫామెన్స్ చూడముచ్చటగా ఉన్న చివరికి రాకింగ్ రాకేష్ రష్మీ కాళ్ళపై పడి వేడుకుంటూ ఉండగా రష్మీ ఆశీర్వదించునట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఈ ప్రోమో చివరిలో జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి సింగర్ మనో మాట్లాడుతూ తనదైన శైలిలో పంచులు వేస్తూ రాకింగ్ రాకేష్ గాలి తీశారు. రాకింగ్ రాకేష్ రష్మి కాళ్ళపై పడుతున్న సందర్భంలో మనో మాట్లాడుతూ.. పొద్దున కేరవాన్ లో రష్మీ కాళ్లపై పడింది ఇందుకేనా రష్మి తో డాన్స్ చేయడం కోసమే అలా కాళ్లపై పడ్డావా అంటూ తన పరువు మొత్తం తీసే సరికి ఒక్కసారిగా రాకింగ్ రాకేష్ బిత్తిరి పోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.