మీకొక న్యాయం.. మాకొక న్యాయమా జబర్దస్త్ జడ్జి పై సెటైర్లు వేసిన ఇమ్మాన్యుయేల్!

జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలోకి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలోను అలాగే, శ్రీదేవి తమ కంపెనీ కార్యక్రమాలలో ఎక్కడ చూసినా ఇంద్రజ హడావుడి కనపడుతుంది. ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం లో జడ్జి ఇంద్రజ పై ఇమ్మాన్యుయ్యేల్ ఆమెను అవమానపరుస్తూ తనపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనేతాజాగా వదిలిన ప్రోమోలో భాగంగా ఇమ్మాన్యుయేల్ జడ్జి పై సెటైర్లు వేశారు.

గతంలో జబర్దస్త్ కమెడియన్ లు వర్ష గురించి మాట్లాడుతూ లేడీ గెటప్ అంటూ ఆమె పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. ఈ విధంగా వర్ష తన పై ఇలాంటి కామెంట్స్ చేయడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి జబర్దస్త్ కార్యక్రమం నుంచి కోపంతో బయటకు వెళ్ళినట్లు గతంలో చూపించారు. ఈ విధంగా వర్షను అవమానపరిచినందుకు ఇమ్మాన్యుయేల్ వర్షకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే మరోసారి స్కిట్ లో భాగంగా ఇలాంటి సెటైర్లు వేస్తూ ఇమ్మాన్యుయేల్ మధ్యలో ఆగి పోయాడు. దీంతో వర్ష ఏంటి అని అడగగా నువ్వు నేపాలీయన్ లాగా ఉన్నావు అంటూ కవర్ చేశాడు. అయితే జడ్జి ఇంద్రజ ఈ విధంగా ఎవరి పై కామెంట్ చేయకూడదు అని చెప్పారు.

ఈ స్కిట్ అనంతరం పైమా ఎంట్రీ ఇచ్చి ఇమ్మాన్యుయేల్ ను ఆడోడా అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా తన గురించి పైమా కామెంట్ చేయడంతో ఇంద్రజ కూడా ఎంతో నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ఈ స్కిట్ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ఆడదాన్ని మగాడిలా ఉన్నావ్ అనొద్దని అన్నారు.. కానీ ఇప్పుడు మగాడిని ఆడోడా?అంటే మీరు నవ్వుతున్నారు మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.