జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ టీమ్ ఎంత గుర్తింపు పొందినదో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ టీమ్ అంటేనే సుధీర్ తో పాటు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ కలిసి చేసే స్కిట్ కు విపరీతమైన ఫాలోయింగ్ వుంటుంది.ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ ముగ్గురూ కలిసి ఎన్నో రకాల స్కిట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని కారణాలవల్ల సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక సుడిగాలి సుధీర్ గెటప్ శీను లేకపోవడంతో ఆటో రాంప్రసాద్ ఒంటరిగా స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే గతవారం ప్రసారమైన కార్యక్రమంలో భాగంగా రాకింగ్ రాకేష్ కెవ్వుకార్తిక్ సుడిగాలి సుదీర్ ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ చేశారు.ఇలా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ రూపంలో తెలియజేయడంతో అక్కడే ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు .కేవలం ఆటో రాంప్రసాద్ మాత్రమే కాకుండా రష్మీ ఇంద్రజ వంటి వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఆటో రాంప్రసాద్ భావోద్వేగానికి గురవడంతో కొందరు సోషల్ మీడియా వేదికగా రేటింగ్ కోసం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా ఆటో రాంప్రసాద్ ఈ కామెంట్ల పై స్పందిస్తూ చాలామంది మేం కేవలం ఈ కార్యక్రమం రేటింగ్స్ కోసమే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అనుకుంటున్నారు. నిజానికి మా ముగ్గురి మధ్య ఉన్న స్నేహ బంధం ఎప్పటికీ విడిపోదని అనుకున్నాము కానీ ఇలా వాళ్ళు వెళ్లిపోవడంతో ఒంటరివాన్ని అయ్యాను అనే ఫీలింగ్ కలిగిందనీ కన్నీళ్లు వచ్చాయి కానీ ఈ కార్యక్రమం రేటింగ్ కోసం తాను కన్నీళ్లు పెట్టుకోలేదని ఈ సందర్భంగా ఆటో రాంప్రసాద్ తన స్నేహితులను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.