రాధే శ్యామ్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌.. కూల్ లుక్ లో ప్ర‌భాస్

పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఖాతాలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది ఈ ఏడాది సమ్మ‌ర్‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు

రాధేశ్యామ్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో చిత్రీక‌రిస్తుండ‌గా, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన క్రేజీ అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఇక న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌గా ప్ర‌భాస్ కూల్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో యంగ్ రెబ‌ల్ స్టార్ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ అభిమానుల మ‌న‌సులు దోచుకుంటున్నారు. మార్చి వ‌ర‌కు చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యంలోను ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన మేకర్స్ ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మకంతో ఉన్నారు. ప్ర‌భాస్‌కు కూడా ఈ విజ‌యం చాలా అవ‌స‌రం. గ‌త ఏడాది సాహోతో నిరాశ‌ప‌ర‌చిన ప్ర‌భాస్ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీస్ట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్ , నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీ కానున్నాడు. ఈ చిత్రాల‌న్నీ పాన్ ఇండియా చిత్రాలుగా తెర‌కెక్క‌నుండ‌గా, వీటితో ప్ర‌భాస్ రేంజ్ తారాస్థాయికి చేరుకోవ‌డం ఖాయం అని అంటున్నారు.