కాఫీడే సీఈవోగా సిదార్థ భార్య మాళవిక హెగ్డే !

కాపీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కొత్త సీఈవోగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ వీజీ సిదార్థ సతీమణి మాళవిక హెగ్డే నియమితులయ్యారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది.

గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. డిసెంబర్ 7వ తేదీ నుంచే ఆమె నియామకం అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇక, మాళవిక హెగ్డే మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె అనే సంగతి తెలిసిందే.

అలాగే కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్రలను నియమించేందుకు సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆమోదం తెలిపారు. వీరు 2020 డిసెంబర్ 31 నుంచి 2025 డిసెంబర్ 30 వరకు పదవుల్లో కొనసాగనున్నారు. బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్న కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది షాపులను నిర్వహిస్తోంది. విదేశాల్లో కూడా ఈ కంపెనీ కాఫీ షాపులు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశం అంతటా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి భారతదేశంలో వృద్ధి చెందుతున్న మనీడ్‌ క్లాస్‌ జనాల కోసం కాపుచీనో, లాట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. కాఫీ డే.. స్టార్‌బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీ వంటి వాటితో పోటీపడతుంది.