కాఫీ డే ఓనర్ విజి సిద్ధార్థ మిస్సింగ్
భారతదేశంలో అతిపెద్ద కాఫీ చైన్ ఔట్లెట్ కేఫ్ కాఫి డే ని నడుపుతున్నా వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుండి కనబడడం లేదు. సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఎస్ ఎం కృష్ణకు స్వయానా అల్లుడు.
సిద్ధార్థ కారులో బయలుదేరి మంగళూరు కి వెళ్ళే దారిలో కారు ఆపమని చెప్పి, “నేను అలా వాకింగ్ కి వెళ్లి వస్తాను నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి” అని డ్రైవర్ కి చెప్పాడట. ఎంతసేపయినా తిరిగి రాకపోయేసరికి డ్రైవర్ కుటుంబ సభ్యులకి విషయం తెలియజేసాడు. విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు సిద్ధార్థ కోసం గాలింపుని ముమ్మరం చేశారు.
ఈ గాలింపుకు పోలీసులు డాగ్ స్క్వాడ్ ని వాడుతున్నారు. అయితే డాగ్ స్క్వాడ్ లోని కుక్కలు ఒక బ్రిడ్జి దగ్గరకి వచ్చి ఆగిపోయాయి. పోలీసులకు అనుమానం వచ్చి గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు వారు ఆ బ్రిడ్జి కింద నీటిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా అభ్యర్థించింది. ఈ విషయమై కర్ణాటక ఎంపీ శోభా భారత హోం మినిస్టర్ అమిత్ షా ని కలిసి కేంద్ర బలగాలను పంపించాలని కోరారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ నాయకుడు DK శివ కుమార్ SM కృష్ణ ఇంటికి చేరుకున్నారు.
ఈమధ్య సిద్ధార్థ తీవ్ర ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యనే సిద్ధార్థ కంపెనీ డైరెక్టర్లకు మరియు ఉద్యోగస్తులకు రాసిన ఒక లేఖ బయటపడింది. ఆ లేఖలో తను చేసిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడాను ఎవరిని మోసం చేయాలని చేయలేదని కంపెనీ బాగు కోసమే చేశాను అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది