ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈయన నటించిన పుష్ప సినిమా భారీ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు వరుసగా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని బడా కంపెనీలు తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
సాధారణంగా జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలంటే సౌత్ లో బాగా పాపులారిటీ ఉన్న వారితోను అలాగే నార్త్ లో కూడా పాపులారిటీ ఉన్నవారితోను చేయించేవారు.ఈ విధంగా ఒక యాడ్ కోసం ఇద్దరు సెలబ్రిటీలను ఎంపిక చేసి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళు.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడంతో కేవలం ఈయనతో మాత్రమే నేషనల్ వైడ్ వారి బ్రాండ్ కు అంబాసిడర్ గా నియమించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ వరుస బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా కోకో-కోలా, ఆస్ట్రల్, కేఎఫ్‌సీ, రెడ్ బస్, జొమాటో యాడ్స్ చేశాడు. ఒక్కో ప్రకటనకు గాను రోజుకి రూ.ఏడున్నర కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇలా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఏడాదికి 100 కోట్లకు పైగా వెనకేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా అర్జున్ యాడ్స్ ద్వారానే ఈ స్థాయిలో సంపాదిస్తున్నారంటే ఈయన క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.